TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీ లో 11 జిల్లాల్లో ఖాళీలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

On: January 21, 2024 11:19 AM
Follow Us:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 11 జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట్లులకు అప్లై చేసుకోవడానికి కనీస విద్యార్హత డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలోని 11 జిల్లాల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 150. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు మాత్రమె దరఖాస్తు చేసుకోవచ్చు ( ఇంజినీరింగ్ విద్యార్థులు అనర్హులు ). అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

TSRTC Recruitment 2024 రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు:

S.No రీజియన్ ఖాళీల సంఖ్య
1 హైదరాబాద్ రీజియన్ 26
2 సికింద్రాబాద్ రీజియన్ 18
3 మహబూబ్ నగర్ రీజియన్ 14
4 మెదక్ రీజియన్ 12
5 నల్గొండ రీజియన్ 12
6 రంగారెడ్డి రీజియన్ 12
7 ఆదిలాబాద్ రీజియన్ 09
8 కరీంనగర్ రీజియన్ 15
9 ఖమ్మం రీజియన్ 09
10 నిజామాబాద్ రీజియన్ 09
11 వరంగల్ రీజియన్ 14
మొత్తం ఖాళీల సంఖ్య: 150

విద్యార్హతలు:

2018, 2019,2020,2021,2022,2023 విద్యా సంవత్సరంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్ వ్యవధి:

మూడు సంవత్సరాల పాటు శిక్షణను ఇస్తారు.

జీతభత్యాలు:

అప్రెంటిస్ కాలంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.

  • మొదటి సంవత్సరం లో నెలకు రూ. 1500/-
  • రెండు సంవత్సరం లో నెలకు రూ. 1600/-
  • మూడు సంవత్సరం లో నెలకు రూ. 1700/-

ఎంపిక విధానం:

విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు సమర్పణకు అభ్యర్థులు ఆన్లైన్లో www.nats.education.gov.in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది:

16 ఫిబ్రవరి 2024 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

TSRTC Recruitment 2024 ముఖ్యమైన లింక్ లు:

Notification Link

Application Link

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp 

Leave a Comment