SSMB 29 Video Leak: ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్, రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్….
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (మహేష్ బాబు)ల కాంబినేషన్ ఎస్ఎస్ఎంబీ-29 (SSMB 29) సినిమాకు సంబంధించిన లీకైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్లిప్ లో మహేష్ బాబు వీల్ చైర్ లో కూర్చున్న ఒక వ్యక్తి వైపు నడుస్తూ, అతని ముందు మహేశ్ మోకాళ్లపై కూర్చునే సన్నివేశం కనిపిస్తుంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఇప్పటి వరకు, రాజమౌళి కానీ చిత్ర నిర్మాణ బృందం కానీ లీక్ గురించి ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(బాలీవుడ్ నటి) హిరోయిన్ గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ నటుడు ముఖ్యమైన పాత్రలో నటించారు.
అయితే ప్రస్తుతం ఈ షూటింగ్ ఒడిశాలో కోరాపుట్ జిల్లాలోని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‍లో షూటింగ్ లోని సెట్ వీడియో లీక్ అయ్యింది.
ఈ వీడియో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ-29ది కాకపోవచ్చు అని మహేష్ నటించిన ఏదైనా యాడ్ ఫిల్మ్ ది కావచ్చు అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. SSMB 29 Video Leak