EPFO New Rules 2025 – ఉద్యోగులకు శుభవార్త! PF ట్రాన్స్ఫర్, పెన్షన్ పెంపు, e-NAMII, సెల్ఫ్ క్లెయిమ్ సిస్టం.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025లో 8 కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ఇవి పీఎఫ్ ట్రాన్స్ఫర్, పెన్షన్ లిమిట్, విత్డ్రా ప్రక్రియ వంటి అంశాలను సులభతరం చేస్తాయి. ఈ మార్పులు లక్షలాది ఉద్యోగులకు ఆర్థిక భరోసా మరియు సౌలభ్యాన్ని అందిస్తాయి.
“ఇక పీఎఫ్ క్లెయిమ్ రోజులు కాదు, గంటల్లో!”
EPFO New Rules 2025 – EPFO తీసుకువచ్చిన 8 కీలక మార్పులు
1. పెన్షన్ లెక్కింపు పద్ధతిలో మార్పు
- పాత పద్ధతి: చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించేవారు
- కొత్త పద్ధతి: చివరి 60 నెలల (5 సంవత్సరాల) జీతం యావరేజ్ తీసుకుంటారు
- ప్రయోజనం: స్థిరమైన, ఎక్కువ పెన్షన్ లభిస్తుంది
2. పెన్షన్ పరిమితి రూ.15,000 కు పెంపు
- పాత పరిమితి: ₹7,500
- కొత్త పరిమితి: ₹15,000
- ప్రయోజనం: పెన్షనర్లకు మెరుగైన జీవన ప్రమాణం
3. సెల్ఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టం
- ఇప్పుడు ఏటీఎం లాగా పీఎఫ్ విత్డ్రా చేయొచ్చు
- క్లెయిమ్ దాఖలు చేసిన 24 గంటల్లోపు డబ్బు జమ
- ఉపయోగాలు: ఇల్లు కట్టడం, పిల్లల చదువు, వైద్యం
4. 100% PF విత్డ్రా సదుపాయం
- అత్యవసరాల్లో మొత్తం బ్యాలెన్స్ నుండి 100% విత్డ్రా చేసుకోవచ్చు
- హెచ్చరిక: వడ్డీ కోసం కనీసం 25% బ్యాలెన్స్ మిగిలి ఉండాలి
5. ఆటోమెటిక్ PF అకౌంట్ ట్రాన్స్ఫర్
- కొత్త కంపెనీలో UAN లింక్ చేసిన వెంటనే, పాత PF బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది
మాన్యువల్ క్లెయిమ్ అవసరం లేదు
6. e-NAMII ని తప్పనిసరి చేయడం
- ఉద్యోగి మరణించినప్పుడు, కుటుంబ సభ్యులు సులభంగా PF & పెన్షన్ పొందడానికి e-NAMII నమోదు తప్పనిసరి
- UAN పోర్టల్ లో సులభంగా నమోదు చేయండి
7. EPFO 3.0 ప్రారంభం
- మొబైల్ యాప్ ద్వారా అన్ని సేవలు
- PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, KYC నవీకరణ ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో
8. KYC & UAN యాక్టివేషన్ తప్పనిసరి
- పీఎఫ్ సేవల కోసం, Aadhaar, PAN, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా UAN తో లింక్ చేయాలి
ఎలా ప్రయోజనం పొందాలి?
- EPF కు వెళ్లండి
- UAN తో లాగిన్ అవ్వండి
- KYC నవీకరించండి (Aadhaar, PAN, Bank)
- e-NAMII నమోదు చేయండి
- EPFO మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి






