Big twist in Telangana local body elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్ను విచారించనుంది. మరోవైపు, ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న ఏం జరగబోతోందనే ప్రశ్న తలెత్తింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఢంకా మోగిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ఈ ఎన్నికలను అధికారులు మొత్తం 5 దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఈ నెల 6న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.
Big twist in Telangana local body elections
మరోవైపు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదనే చర్చ జరుగుతోంది. దీనితో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? ఆశావహులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
