TS Apex Bank Recruitment 2025 లో 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. డిగ్రీ అర్హత, తెలుగు నైపుణ్యం అవసరం. ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి. చివరి తేదీ 06-11-2025.
TS Apex Bank Recruitment 2025: డిగ్రీ అర్హతతో 225 ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 225 ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ మరియు వరంగల్ జిల్లాలలో ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 6, 2025.
ప్రధాన వివరాలు
| అంశం | వివరం |
|---|---|
| సంస్థ | తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) |
| పోస్ట్ పేరు | స్టాఫ్ అసిస్టెంట్ |
| మొత్తం ఖాళీలు | 225 |
| అర్హత | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ |
| భాషా అర్హత | తెలుగులో ప్రావీణ్యం, ఇంగ్లీష్ లో జ్ఞానం |
| నివాస నిబంధన | తెలంగాణ రాష్ట్రానికి స్థానికుడు కావాలి |
| వయస్సు పరిమితి | 18–30 సంవత్సరాలు (01-10-2025 నాటికి) |
| చివరి తేదీ | 06 నవంబర్ 2025 |
జిల్లా వారీ ఖాళీల వివరాలు
| జిల్లా | ఖాళీలు | నోటిఫికేషన్ లింక్స్ |
|---|---|---|
Apex Bank Recruitment 2025 Notification & Vacancies |
||
| హైదరాబాద్ | 32 | Click Here |
| కరీంనగర్ | 43 | Click Here |
| ఖమ్మం | 99 | Click Here |
| మహబూబ్నగర్ | 09 | Click Here |
| మెదక్ | 21 | Click Here |
| వరంగల్ | 21 | Click Here |
| మొత్తం | 225 | TeluguTechs |
జీతం మరియు ప్రయోజనాలు
- జీత శ్రేణి: ₹24,050 – ₹64,480 నెలకు
- అదనపు ప్రయోజనాలు: DA, HRA, Medical Allowance, NPS మరియు ఇతర బ్యాంక్ ప్రయోజనాలు
దరఖాస్తు రుసుము
- జనరల్ / BC / EWS: ₹750/-
- SC / ST / దివ్యాంగులు: ₹250/-
- చెల్లింపు ఆన్లైన్ ద్వారా మాత్రమే
ఎంపిక ప్రక్రియ
- ఆన్లైన్ రాత పరీక్ష (ఒబ్జెక్టివ్ టైప్)
- పత్రాల ధృవీకరణ (Document Verification)
పరీక్ష సిలబస్ సాధారణ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఎప్పిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పై ఆధారపడి ఉంటుంది.
TS Apex Bank Recruitment 2025 అర్హత ప్రమాణాలు
- విద్యార్హత: ఏదైనా స్ట్రీమ్ లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత
- భాష: తెలుగులో ప్రావీణ్యం మరియు ఇంగ్లీష్ లో మంచి జ్ఞానం ఉండాలి
- నివాసం: అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి స్థానికుడు కావాలి
- వయస్సు: 01-10-2025 నాటికి 18–30 సంవత్సరాలు
- వయో సడలింపు: SC/ST/BC/EWS కు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10–15 సంవత్సరాలు
ముఖ్యమైన లింకులు
Official Website
Apply Online
Download Official Notification PDF
సూచన: మీ తెలుగు నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు (DEGREE, Computer లేదా ఇతర సర్టిఫికెట్లు) సిద్ధం చేసుకోండి. చివరి తేదీ ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.
Disclaimer
ఈ సమాచారం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) యొక్క అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది. ఖచ్చితమైన వివరాల కోసం TGCAB సందర్శించండి.
“తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”






