TRAI Name Presentation Rule : ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు

TRAI Name Presentation Rule: ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. మార్చికల్లా అందుబాటులోకి!

TRAI Name Presentation Rule: మొబైల్ లో మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేస్తే ఆ వ్యక్తి నంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ (Incoming calls) సమయంలో మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

డిజిటల్‌ అరెస్ట్‌ వంటి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు, మోసపూరిత కాల్స్‌ను నిలువరించే ఉద్దేశంతో కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP) సదుపాయాన్ని టెలికాం విభాగం (DoT) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ఏకీభవించింది. ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే కనిపించేలా చేయడానికి ట్రాయ్‌ అంగీకరించింది. ఒకవేళ వినియోగదారుడు తన పేరు వద్దూ అనుకుంటే ఆ పేరును డిస్‌ప్లే చేయరు. 2జీ, 3జీ వినియోగదార్లకు దీన్ని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్, డాట్‌ అభిప్రాయపడ్డాయి. 4జీ, అంతకుమించి సాంకేతికత ఉన్న ఫోన్లకే దీనిని వర్తింపజేయనున్నారు. ఈ ఫీచర్‌ను వొడాఫోన్‌, జియో సంస్థలు ప్రయోగాత్మకంగా హరియాణాలో పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను టెలికాం కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చేలా డాట్‌ చొరవ తీసుకోనుంది. దేశవ్యాప్తంగా మార్చి 31కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

Click here for More Updates

To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

Scroll to Top