TGRTC Conductor Recruitment 2025 : 12 సంవత్సరాల తరువాత కండక్టర్‌ ఉద్యోగాల భర్తీ?

TGRTC Conductor Recruitment 2025: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో 12 సంవత్సరాల తరువాత 1,500 కండక్టర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి అనుమతించాలని TGఆర్టీసీ తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.

2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్‌ పోస్టుల నియామకం జరగలేదు. 12 ఏళ్ల తర్వాత 2025 లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం లేదా కొన్ని రూట్లలో డ్రైవర్ లే కండక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంస్థలో ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ల వల్ల ఖాళీలు పెరుగుతున్నాయి.

2014-15లో,  56,740 ఉన్న ఉద్యోగుల సంఖ్య 2025 జూన్‌ నాటికి ఆ సంఖ్య 39,652కి పరిమితమైంది. అంటే దాదాపుగా 30 శాతంపైగా తగ్గారు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతోంది. ఇందులో కండక్టర్ల సమస్య ఎక్కువగా ఉంది. దూరప్రాంత సర్వీసుల్లో ఏసీ, సూపర్‌లగ్జరీలు, డీలక్స్‌ బస్సులను వన్‌మ్యాన్‌ సర్వీసులుగా మార్చుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్ని కూడా ఆ జాబితాలో చేర్చింది.

TGRTC Conductor Recruitment 2025

కొన్ని రూట్లలో కండక్టర్లు ప్రధాన బస్టాపులు, బస్టాండ్లలో ఉంటూ అక్కడే టికెట్లు జారీ చేస్తున్నారు.

TGRTC Conductor Recruitment 2025 Notification

ఆ పోస్టులతో కలిపి భర్తీ చేస్తారా?: ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం 11 విభాగాలతో కలిపి 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది క్రితమే అనుమతి ఇచ్చింది. సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

ఇది కొలిక్కివచ్చాక కండక్టర్ల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా మొత్తంగా కలిపి భర్తీ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Disclaimer:ఈ సమాచారం కేవలం సూచనల కోసం మాత్రమే. ఖచ్చితమైన వివరాలకు ఎల్లప్పుడూ TGRTC అధికారిక వెబ్‌సైట్ చూడండి.
Follow us on- Facebook | YouTube | Telegram | Whatsapp

Scroll to Top