Village Revenue Officers Duties | గ్రామ రెవెన్యూ అధికారులు విధులు

On: August 8, 2025 12:33 PM
Follow Us:
Village Revenue Officers Duties

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Village Revenue Officers GPO Duties and responsibilities, గ్రామ రెవెన్యూ అధికారులు విధులు మరియు భాద్యతలు GPO

I. సాధారణ పరిపాలన / రెవెన్యూ విధులు

1. గ్రామ పాలన వ్యవహారాల రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడం.
2. ప్రభుత్వానికి రావలసిన భూమిశిస్తు, సెస్లలు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయడం.
3. సర్వే రాళ్ళు తనిఖీతో సహా పంటలను నూరు శాతం అజమాయిషీ చేయడం.
4. ధృవపత్రముల జారీ : గ్రామ రెవెన్యూ అధికారులు సంబంధిత గ్రామములలో ఈ దిగువ పేర్కొనబడిన
ధృవపత్రములను నియమ బద్దముగా జారీ చేయాలి.
A)జన్మస్థల ధృవ పత్రములను మరియు సాల్వెన్సీ సర్టిఫికేట్లు
B)నివాస పత్రము
C)పహాణి / అడంగల్ ఎక్స్ట్రాక్టులు
5. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు ఇతర విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు సత్వరం ఉన్నతాధికారులకు తెలియచేయడం. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలను అంచనా వేయడంలో రెవెన్యూ అధికారులకు సహకరించడం, సహాయాన్ని అందజేయడం.
6. అకస్మాత్తుగా వరదలు / ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వర చర్య తీసుకొను నిమిత్తము రైల్వే స్టేషన్ మాస్టర్కు సమాచారాన్ని అందించడం.
7. గ్రామ సేవకుల వేతనాల బిల్లులు తయారు చేయడం
8. గ్రామ చావిడీల నిర్వహణ
9. ప్రభుత్వ భూములు, చెరువులు, చెట్లు, ప్రభుత్వానికి చెందిన ఇతర ఆస్తుల పరిరక్షణ. ప్రభుత్వ ప్రయోజనాలు
కాపాడేందుకు గట్టి చర్యలు తీసుకోవడం.
10. నిధి నిక్షేపాలు మరియు హక్కులు లేని ఆస్తుల గురించి ఉన్నతాధికారులకు సత్వరం సమాచారం అందజేయుట.
11. పురాతన కట్టడాలు కూల్చివేత గురించి కానీ శిలాశాసనాలు, స్మారక చిహ్నాలు లభ్యమైనప్పుడు కానీ తహశీల్దారు ఆ సమాచారం అందించాలి.
12. ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. గ్రామ రెవెన్యూ అధికారుల పరిధిలోని గ్రామాలలోనూ, పరిసరాల్లోనూ, ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించిన రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాల వంటి భూములు దుర్వినియోగం కాకుండా, నష్టపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి.
13. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనా, వాటికి నష్టం వాటిల్లినా సంబంధిత సమాచారాన్ని తహశీల్దారు తక్షణం తెలియజేయాలి. తదనంతర చర్యలు చేపట్టాలి.
14. రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ప్రభుత్వ బాకీలు వసూలు చేయు నిమిత్తం సదరు బాకీ దారుల ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియలో సంబంధిత అధికారులకు సహకరించాలి.
15. లీగల్ నోటీసులు, సమన్లు జారీ చేయడంలో అధికారులకు సహకరించాలి.
16.
17. ప్రజలకు అవసరమైన సంఘటనలను తెలియచెప్పటానికి దండోరా, ఇతర పద్ధతులు అవలంభించాలి.
18. వారసులు లేని ఆస్థి స్వాధీనమైనప్పుడు పంచనామా నిర్వహించాలి.
19. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకు భద్రత కల్పించాలి.
20. ఒటర్ల జాబితాల తయారీ, నవీకరణ (అప్డేట్)లో సహకరించి, సవరణ చేయవలసినప్పుడు ఇతర ఎన్నికల విధులు నిర్వహించాలి.
21. తమ పరిధిలోని గ్రామ పంచాయితీలు నిర్వహించే సమావేశాలకు హాజరై, వాటి అభ్యర్ధన మేరకు పింఛన్లు, అమలులో ఉన్న రేషన్ కార్డుల వివరాలు, ఇళ్ళ స్థల పట్టాల పంపిణీ, రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలకు సమాచారాన్ని అందజేయాలి.
22. ఎ.పి. ట్రాన్స్కో గ్రామములో నిర్వహించుచున్న విద్యుత్ పనుల నిర్వహణకు సహకరించాలి.
23. గ్రామాలలో విద్యుత్ చౌర్యం, విద్యుత్ అక్రమ వాడకం గురించిన సమాచారాన్ని సంబంధిత విద్యుత్ అధికారులకు అందజేయాలి.
24. సమర్ధాధికారి / ఉన్నతాధికారి ప్రకటన మేరకు కనీస వేతనాల చట్టం 1948 క్రింద వీరు ఇన్స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఏ రెవెన్యూ అధికారి కానీ, జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ. లేక తాహశీల్దార్ నియమించిన అధికారులు కానీ తనిఖీకి కోరినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారి తాను నిర్వహిస్తున్న గ్రామ రిజిష్టర్లు, ఇతర రికార్డులు చూపవలయును. పైన పేర్కొన్న విధంగా అధికారులు కోరితే తప్ప, ఆ రికార్డులను గ్రామ రెవెన్యూ అధికారులు తమ వ్యక్తిగత ఆధీనంలో భద్రపరచాలి.
25. బదలీ /సస్పెన్షన్/తొలగింపు /డిస్మిస్ /పదవీ విరమణ / సెలవుపై వెళ్ళే సందర్భాలలో (క్యాజువల్ లీవ్ మినహా) అన్ని గ్రామ రిజిష్టర్లు, రికార్డులను అధికారికంగా నియమితులైన అధికారికి అప్పగించాలి.

II. పోలీసు విధులు

1) హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాలలో అశాంతి ప్రబలడానికి గల ఇతర ముఖ్య పరిణామాల గురించి పోలీసు శాఖకు సత్వరమే సమాచారం అందజేయాలి.
2) అనుమానస్పదంగా గ్రామములో ప్రవేశించి సంచరిస్తున్న వారి గురించి, పోలీసులకు సమాచారం అందించాలి.
3) హింసాత్మక సంఘటనలను, ప్రజలకు గందరగోళం / ఇబ్బంది (న్యూసెన్స్) కలిగించే చర్యలను నిలువరించాలి.
4) అపరాధులను గుర్తించి, న్యాయ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.
5) చోరీ సొత్తు కోసం సోదా నిర్వహించి, పోలీసు స్టేషన్లో అప్పగించాలి.
6) నేరానికి సంబంధించిన రుజువులను భద్రపరచాలి.
7) వారసులు లేని / అడగని సొత్తులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్లో అప్పగించాలి.

Village Revenue Officers GPO Duties and responsibilities

III సామాజిక సంక్షేమం, అభివృద్ధి

1) ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి పథం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి.
2) దారిద్య్ర రేఖకు దిగువన వున్న కుటుంబాల వివరాల సేకరణలో సహకరించాలి. వారి ఆదాయ పరిమితిని అవరోహణ క్రమంలో జాబితాలు రోపొందించాలి.
3) బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన పత్రాలు తయారుచేయడంలో, ఈ పథకం అమలుకు సహకరించాలి.
4) మహిళలు, పిల్లలపై జరిగే దురాగతాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. 24 గంటలలోగా చర్య తీసుకోవాలి.
5) షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు వారిపై జరిగే అత్యాచారాల గురించి సంబంధిత ఉన్నతాధికారులకు సమచారం అందజేసి, వారికి సహకరించాలి.
6) షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం ద్వారా అంటరానితనాన్ని నిర్మూలించాలి.
7) అంటువ్యాధులు ముఖ్యంగా మలేరియా, మెదడువాపు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలినప్పుడు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణం తెలియజేయాలి.
8) గిరిజన గ్రామ అభివృద్ధి సంస్థల సమావేశాలకు హాజరై, సూక్ష ప్రణాళికల తయారీ వాటి అమలుకు సహకరించాలి.
9) అక్షరాస్యత తరగతుల నిర్వహణలో సహకారం అందించాలి.
10) పంటల భీమా పథకం అమలుకు, పంటలను అంచనా కట్టడంలో తోడ్పాటును అందించాలి.
11) వ్యవసాయ కార్యక్రమాల అమలు, సమాచార విస్తరణకు చేయూతనివ్వాలి.
12) వ్యవసాయ గణాంకాలు తయారీలో సహకరించాలి.
13) విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నల్లబజారులో విక్రయిస్తున్నటు వంటి సమాచారాన్ని
తక్షణం సంబంధిత అధికారులకు అందజేయాలి.
14) సహకార రంగం పరిధిలోని, వెలుపల గల చేనేత కార్మిక కుటుంబాలు, వారి ఆర్థిక స్తోమత
వివరాలు సేకరణలో తోడ్పాటును అందించాలి.
15) చేనేత కార్మికులకు అవసరమైతే ‘డిపెండెన్సీ’ సర్టిఫికెట్లు జారీ చేయాలి.
16) వివాహ నిర్బంధిత రిజిస్ట్రేషన్ చట్టము 15/2002 ప్రకారము రాష్ట్రంలో జరిగే వివహములను
తప్పనిసరిగా రిజిష్టరు చేయు నిమిత్తం తమ పరిధిలో నున్న గ్రామములో, సముదాయములో
మ్యారేజ్ అధికారిగా వ్యవహరించుట.

IV. ఇతరములు

1. ప్రభుత్వం, భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్, కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహశీల్దారు లేక ఏ ఇతర అధికారి అయినా అప్పగించిన విధులు నిర్వర్తించాలి.

Village Revenue Officers GPO Duties

Village Revenue Officers Vacancies

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp